బాహుబలిని మించింది : శిద్యాత్ లో నలుగురు సూపర్ స్టార్స్ ఒక్క హీరో అంటేనే రచ్చ.. మల్టీ స్టారర్ మూవీ అంటే బీభత్సం.. అలాంటిది దేశంలోని సూపర్ స్టార్స్ అందరూ ఒకే సినిమాలో కనిపిస్తే అది బాహుబలికి మించిందే అవుతుంది కదా.. ఇన్ని ఆశలు, ఊహలను నిజం చేస్తూ అతిపెద్ద సినిమా హిందీలో తెరకెక్కబోతుంది. దీన్ని నిర్మిస్తుంది.. దర్శకత్వం వహిస్తుంది కబీర్ ఖాన్. ఇందులో మెయిన్ హీరో షారూఖ్ ఖాన్. హీరోయిన్ దీపిక పదుకునే. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో.. మరో ముగ్గురు సూపర్ స్టార్స్ కూ నటించబోతున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ , తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ ఈ సినిమాలో నటించనున్నారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా శిద్యాత్ సినిమా కథ ఉండబోతుంది. ఇందుకు సంబంధించి చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని బాలీవుడ్ సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభం కాబోతున్నది ఏక్తాటైగర్, భజరంగీ భాయ్ జాన్, కాబూల్ ఎక్స్ ప్రెస్, న్యూయార్క్ వంటి సంచలన సినిమాలు నిర్మించాడు కబీర్ ఖాన్. ఇదే బాటలో సొంత కథతో రొమాంటిక్ స్టోరీని తయారు చేశారంట. కథను అనుగుణంగా హీరోత...