విజయ దేవరకొండ, షాలిని జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణరు రెడ్డి వంగా నిర్మిస్తున్న చిత్రం 'అర్జున్ రెడ్డి'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత ప్రణరు వంగా మాట్లాడుతూ, 'హీరో,హీరోయిన్లు విజరు, షాలిని అందించిన సపోర్ట్‌తోనే హైదరాబాద్, డెహ్రాడూన్, మంగళూరు, న్యూఢిల్లీ, ఇటలీ వంటి ప్రదేశాల్లో ఎలాంటి అవాంతరం లేకుండా షూటింగ్ చేయగలిగాం. ఇంటెన్స్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. విలక్షణ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపే హీరో విజరు దేవరకొండ ఈ చిత్రంలో యారగంట్ మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన చిత్ర పోస్టర్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
సన్నీలియోన్.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఇప్పుడంటే బాలీవుడ్ హీరోయిన్‌గానీ, ఒకప్పుడు ఆమె పోర్న్ స్టార్. పోర్న్ సినిమాల్లో నటించి పాపులర్ అయిన సన్నీలియోన్, ఇప్పుడు బాలీవుడ్ అడల్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పుడు పాయింట్ లోకి వస్తే.. ఓ తెలుగు సినిమాబాలీవుడ్ రిమేక్ లో నటించబోతుంది సన్నీ. టాలీవుడ్ బెస్ట్ థ్రిల్లర్స్ లో 'ఏ ఫిల్మ్ బై అరవింద్' ఒకటి. ఈ సినిమాతోనే దర్శకుడు శేఖర్ సూరి తన మార్క్ ను చాటుకున్నాడు. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ద శేఖర్ సూరి ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగులో షెర్లిన్ చోప్రా చేసిన పాత్రకి సన్నీలియోన్ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నాడు. ఆమెనే ఈ పాత్రకి న్యాయం చేయగలదని భావించి సంప్రదింపులు జరుపుతున్నాడట. ఈ విషయంలో సన్నీ కూడా అనుకూలంగా వుందని బాలీవుడ్ రిపోర్ట్
Comments
Post a Comment