రూ.2,500 మాత్రమే : జియో ఫోన్ కు పోటీగా ఐడియా
ఒకే ఒక్క దెబ్బ.. మొత్తం టెలికాం, మొబైల్ తయారీ కంపెనీలు దిగివస్తున్నాయి. జియో ఫోన్ ఫ్రీ ఆఫర్, రూ.1500 డిపాజిట్ సంచలనం అయ్యింది. దీనికి పోటీగా మిగతా కంపెనీలూ రంగంలోకి దిగాయి. 4G ఫీచర్స్ ఫోన్లను చౌక ధరలో మార్కెట్ లోకి తీసుకొచ్చేందకు ప్రయత్నిస్తున్నాయి ఐడియా, వొడాఫోన్ కంపెనీలు. ఐడియా కంపెనీ తీసుకొచ్చే ఫోన్ లో జియో ఫోన్ కంటే ఎక్కువ ఫీచర్లు ఉండనున్నాయి. ఈ ఫోన్ ధర రూ.2,500 వరకు ఉంటుందని ప్రకటించారు ఐడియా సెల్యులార్ ఎండీ హిమాంశు కపానియా.
ఈ ఫోన్ తీసుకున్న కస్టమర్లు అవసరమైతే వేరే టెలికాం ఆపరేటర్లకూ మారవచ్చు. తమ కంపెనీ ఆఫర్ చేసే 4G స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి యాప్స్ కూడా ఉంటాయని తెలిపారు కపానియా. రిలయన్స్ జియో ఫోన్‌లో మాత్రం ఇలాంటి సదుపాయాలు ఉండవని.. ఈ విషయాన్ని మొబైల్ కస్టమర్లు గుర్తుంచుకోవాలని కోరారు. జియో అందించే యాప్స్ మాత్రమే వాళ్లు ఇచ్చే ఫోన్ ఉంటాయన్నారు. రిలయన్స్ జియో మాదిరిగా 4G ఫోన్లు ఉచితంగా అందించే ఆలోచన లేదని స్పష్టం చేసింది ఐడియా.
వాయిస్ కాల్స్‌తో పాటు, ఫోన్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ హ్యాండ్‌సెట్లు తీసుకురానున్నట్టు చెప్పారు. ఐడియా సెల్యులార్ కంపెనీ ఇందుకోసం ఇప్పటికే మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలతో చర్చిస్తున్నట్టు సమాచారం.
Comments
Post a Comment